శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (16:40 IST)

సాగర్ నీటి యుద్ధం : నీటి విడుదలపై ఏపీ - తెలంగాణ అధికారుల వాగ్వాదం.. ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సోమవారం నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సోమవారం నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. నాగార్జు సాగర్ కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి విడుదలపై రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. 
 
సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ అధికారులు నీటిని విడుదల చేయగా, దాన్ని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. జలాశయంలో తమకు రావాల్సిన వాటా పూర్తి కాకుండా, ఏపీకి నీటిని ఎలా తీసుకువెళతారని వారు నిలదీశారు. వేసవిలో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని ఏపీ అధికారులు చెప్పినా వినలేదు. పైగా, నీటిని తాగునీటి కోసం హైదరాబాద్‌కు తరలించాలని తెలంగాణ అధికారులు పేర్కొంటూ నీటి విడుదలను అడ్డుకున్నారు. 
 
కాగా ఏపీకి కుడికాల్వ ద్వారా రోజుకు 7 వేల క్యూసెక్కుల చొప్పున 2 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించిందని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం డ్యామ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ అధికారులకు రక్షణగా ఏపీ పోలీసులు, తెలంగాణ అధికారులకు రక్షణగా తెలంగాణ పోలీసులు మోహరించారు. దీంతో డ్యాం వద్ద వాతావరణం వేడెక్కింది.