బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (10:22 IST)

వైసీపీకి నల్లపురెడ్డి ప్రసన్న దూరం కానున్నారా? కారణం ఏమిటో తెలుసా?

వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్న వైసీపీకి దూరం కాబోతున్నారని ప్రచారం జోరందుకుంది. ఇందుకు కారణంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించడమే. 2009 ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ

వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్న వైసీపీకి దూరం కాబోతున్నారని ప్రచారం జోరందుకుంది. ఇందుకు కారణంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించడమే.  2009 ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న, వైఎస్ పంచన చేరారు. అలా సైకిల్ దిగేసి వైఎస్సార్‌తోనే ప్రసన్న ఉండిపోయారు. ఆపై వైఎస్‌ మరణాంతరం జగన్ వెంట నడిచారు. 2011లో జరిగిన ఉపఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు.. కానీ, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తనకు పార్టీ ఆర్ధికంగా సాయపడలేదన్న అసంతృప్తితో ప్రసన్న ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికల్లో నకిలీ మద్యం కేసులో నిందితుడిగా వున్న అల్లంపాటి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి గూడూరు నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారని, అది పార్టీకి మచ్చపడుతుందని దూరం పెట్టాలని ప్రసన్న పదేపదే అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ నియోజకవర్గంలోని కోట మండలం  ప్రసన్న సొంత ప్రాంతం. అక్కడ అల్లంపాటి-ప్రసన్నకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నా పార్టీ ఏమాత్రం పట్టించుకోవట్లేదని ప్రసన్న వాదిస్తున్నారు. 
 
తన పట్ల, పార్టీ వైఖరిపై ప్రసన్న గుర్రుగా ఉన్నారట. గతంలో నెల్లూరు జిల్లాలో ఆనం వర్సెస్ నల్లపురెడ్ల రాజకీయాలు నడిచాయి. ప్రసన్న తన బంధువైన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విషువర్ధన్ రెడ్డి కుటుంబాలను కలుపుకుని స్థానిక సంస్థల్లో 85కు పైగా ఓట్లు ఉన్నాయి.
 
అయినా ఒక్క ఓటు కూడా లేని ఆనం కుటుంబానికి సీటు ఇచ్చారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని మాట తప్పారని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండాలా అంటూ సన్నిహితుల వద్ద ప్రసన్న వాపోతున్నారని తెలిసింది. అలాగే 2014 ఎన్నికల తర్వాత ఆనం ఫ్యామిలీ కంటే ముందే చంద్రబాబు నుంచి ప్రసన్నకే ఆహ్వానం అందినా జగన్‌తోవున్న తమకు ఒరిగిందేంటని వారు ప్రశ్నిస్తున్నారు.