నాని - వంశీ జాగ్రత్త... మావయ్యను వ్యక్తిగతంగా దూషిస్తే సహించం : నందమూరి చైతన్యకృష్ణ

Nandamuri Chaitanya Krishna
ఠాగూర్| Last Updated: బుధవారం, 20 నవంబరు 2019 (08:07 IST)
ఇటీవల ఏపీ మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఈ విమర్శలు నవ్యాంధ్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో నందమూరి జయకృష్ణ తనయుడు స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు.

'కొడాలి నాని, వంశీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం మా మావయ్య చంద్రబాబు. అది మరిచి నోటి కొచ్చినట్లు దూషిస్తే సహించేది లేదు. విధి విధానాల పరంగా ఏమైనా అభ్యంతరాలుంటే విమర్శించుకోండి. అంతేకాని వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు' అంటూ ఓ వీడియో సందేశంల మండిపడ్డారు.దీనిపై మరింత చదవండి :