ఎపిలో ఇలాంటి ఉప ఎన్నిక ఎప్పుడైనా జరిగిందా?

ఆదివారం, 13 ఆగస్టు 2017 (15:20 IST)

bhuma nagireddy

bhuma nagireddy
ఒక్క నియోజకవర్గం సీటుకు అధికారం రాదు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు.. కానీ ఆ ఉప ఎన్నికే ఆ రెండు పార్టీలకు ఎంతో ముఖ్యం. కానీ ఒక్క సీటు కోసం రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నం గతంలో ఎప్పుడు ఏ ఉప ఎన్నికల్లో జరగలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా నంద్యాల ఉప ఎన్నికల్లో జరుగుతున్న సీన్లు. 
 
భూమా నాగిరెడ్డి మరణం తరువాత నంద్యాల ఉప ఎన్నిక జరుగుతోంది. తెలుగుదేశంపార్టీ తరపున బ్రహ్మానందరెడ్డి, వైసిపి తరపున శిల్పా మోహన్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. వీరి గెలుపే ఇప్పుడు రెండు పార్టీల అధినేతలకు సవాల్ గా మారింది. ప్రభుత్వం అధికార అండతో గెలిచేందుకు రకరకాల ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసేస్తున్నారు. అది కూడా ఒక్క ఓటుకు వెయ్యిరూపాయలట. వైసిపి ఇలా చేస్తుంటే టిడిపి మాత్రం ఓటర్లకు మద్యం ఆఫర్ ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరు ఎంత తాగితే అంత ఇస్తోందట. దీంతో నంద్యాలలో బార్లు బార్లా తెరుచుకున్నాయి. ఆదాయం కూడా ఒక్కసారిగా బార్లలో పెరిగిపోయిందట. 
 
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నంద్యాల ఉప ఎన్నిక జరుగుతోందని, ఇలాంటి ఎన్నికను అస్సలు చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరు ఏమనుకున్నా.. ఏం జరిగినా తాము మాత్రం తగ్గకూడదు.. గెలుపే లక్ష్యంగా పోరాడాలన్న దిశగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కర్నాటకలో పవన్ పార్టీ క్సెరాక్స్... స్థాపించబోయేది ప్రముఖ నటుడే...

వైవిధ్యమైన చిత్రాలతో అటు కన్నడ, ఇటు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు ...

news

నర్సులే డెలివరీ చేశారు.. కవలలు పుట్టారు.. అంబులెన్స్ అందకపోవడంతో..

మాతాశిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ.. వాటి అమలులో ...

news

అంబిక, అంబాలికల్లా.. ఇకపై వితంతువులు కూడా సంతానం పొందవచ్చు..

మహాభారతంలో విచిత్ర వీర్యుడు మరణించడంతో వితంతువులైన అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుడు, ...

news

చేయి లేకపోతే ఏం... చల్తా హై... జాలీగా వుంటా గురూ అంటున్న యువతి

అంగవైకల్యం అనగానే చాలామంది కుంగిపోతుంటారు. పుట్టుకతో వచ్చే అంగవైకల్యం సంగతి అలా వుంచితే ...