శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 29 జులై 2017 (20:50 IST)

అబ్బే.. సినిమాలు, రాజకీయాలొద్దండి.. హెరిటేజే చాలు: నారా బ్రాహ్మణి

నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఆగ‌స్టు 23న ఈ ఉప ఎన్నిక జ‌రుగుతుంది. 28న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ రెండూ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేస

నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఆగ‌స్టు 23న ఈ ఉప ఎన్నిక జ‌రుగుతుంది. 28న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ రెండూ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. టీడీపీ ప్ర‌చారం కోసం చంద్ర‌బాబు ఇప్ప‌టికే రెండుసార్లు నంద్యాల వ‌చ్చి వెళ్లారు. నోటిఫికేష‌న్ రావ‌డంతో ఆయ‌న మ‌రోసారి నంద్యాలలో ప్ర‌చారం చేయ‌నున్నారు. 
 
ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్కడే ప‌ది రోజుల పాటు మ‌కాం వేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ రోడ్ షోల‌కు ప్లాన్ చేస్తున్నారు. జ‌గ‌న్‌తో పాటు తల్లి విజ‌య‌ల‌క్ష్మి, సోద‌రి ష‌ర్మిల కూడా ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు. వైసీపీ ప్ర‌చారం ఇలా ఉంటే టీడీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి కూడా ప్ర‌చారంలోకి దిగుతున్న‌ట్టు తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి సినిమాలు, రాజకీయాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు. సినిమాలు, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. ఫిక్కి సదస్సులో బ్రాహ్మణి మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టంతా హెరిటేజ్ అభివృద్ధిపైనే ఉందన్నారు. పాల ఉత్పత్తిలో హెరిటేజ్ ను దేశంలో నెంబర్-1గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యుల సహకారం వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఆమె చెప్పారు. హెరిటేజ్ ద్వారా 10 లక్షల మంది రైతులకు సేవ చేస్తున్నామని చెప్పిన ఆమె, ఇంతకంటే ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు.