Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు ఆస్తులు రూ.2.53 కోట్లు... దేవాన్ష్ ఆస్తులు రూ.11.54 కోట్లు : మంత్రి లోకేష్

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (09:37 IST)

Widgets Magazine
nara lokesh

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తన తండ్రి చంద్రబాబు నికర ఆస్తులు రూ.2.53 కోట్లుకాగా, తన కుమారుడు నారా దేవాన్ష్ నికర ఆస్తులు విలువ రూ.11.54 కోట్లుగా ఉందని వెల్లడించారు. 
 
ఆయన శుక్రవారం అమరావతిలో ఈ ఆస్తులను వెల్లడించారు. చంద్రబాబు తన కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలను వెల్లడించడం ఇది వరుసగా ఏడో యేడాది. యావత్ భారత్ దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఈ విధంగా తమ ఆస్తులను ప్రకటించలేదని అన్నారు. తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ మార్పులేదని లోకేశ్ పేర్కొన్నారు. 
 
కాగా, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు తన, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలను విడుదల చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి నాడు తెరదీశారు. తమపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసే ముందు వాళ్ల ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని, పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు. 
 
కాగా, చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల వివరాలను పరిశీలిస్తే, చంద్రబాబు నికర ఆస్తులు రూ.2.53 కోట్లు, భువనేశ్వరి ఆస్తులు రూ.25.41 కోట్లు, లోకేశ్ నికర ఆస్తులు రూ.15.21 కోట్లు, బ్రహ్మణి నికర ఆస్తులు రూ.15.01 కోట్లు, దేవాన్ష్ నికర ఆస్తులు: రూ.11.54 కోట్లుగా ఉందని తెలిపారు. తమ కుటుంబానికి ఎక్కువ ఆదాయం హెరిటేజ్ సంస్థ నుంచి వస్తోందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ రూ.2600 కోట్లకు చేరుకుందని లోకేష్ వివరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆస్ట్రేలియాలో భార్యను వేధించాడు.. హైదరాబాదులో అరెస్టయ్యాడు..

విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి డబ్బుకు కక్కుర్తి పడి కట్టుకున్న భార్యనే అదనపు కట్నం ...

news

అమ్మాయిని సెట్ చేయాలంటూ... విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ కామాంధుడయ్యాడు. హాస్టల్‌లో ఉంటున్న వరుసకు బావ అయ్యే ...

news

మోడీ నీచుడు.. సభ్యత లేనివాడు... అయ్యర్ :: వేటేసిన కాంగ్రెస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నీచుడు, సభ్యత లేనివాడు అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ...

news

మూగబోయిన గుజరాత్ : 9న తొలిదశ పోలింగ్

గుజరాత్ రాష్ట్రం మూగబోయింది. తొలి దశ ఎన్నికల పోలింగ్ జరిగే అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం ...

Widgets Magazine