శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (13:05 IST)

పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: నారా లోకేష్ ట్వీట్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడూ, ఎల్లప్పుడూ విజయం, సంతోషం మీకు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అభినందిస్తున్నా" అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 
 
2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన పవన్ ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఆయన మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంపై పలువురు రీట్వీట్లు చేశారు.

ఓ ట్వీట్‌లో ఒకరు స్పందిస్తూ... నారా లోకేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మరో ట్వీట్లో... జూనియర్ ఎన్టీఆర్‌కు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు.