అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్

శుక్రవారం, 17 నవంబరు 2017 (12:35 IST)

Amaravati

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతిచ్చింది. అమరావతి నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను ఎన్జీటీ తోసిపుచ్చింది. అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగైదు పిటిషన్లపై విచారించిన ఎన్జీటీ శుక్రవారం తుదితీర్పు వెలువరించింది. 
 
అమరావతిలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారన్న పిటిషనర్ల అభ్యంతరాలను ఎన్జీటీ తోసిపుచ్చింది. అయితే, పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను ఖచ్చితంగా అమలుచేస్తూనే నిర్మాణాలు సాగాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది.
 
అయితే, కొండవీటి వాగు దిశ మార్చినా ప్రవాహానికి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణా నది ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. 
 
అమరావతిలో నిర్మాణాలను పర్యవేక్షించించేందుకు రెండు కమిటీలను నియమించింది. ఈ కమిటీలు అమరావతిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్జీటీకి చేరవేస్తుంటాయి. పైగా, ఈ రెండు కమిటీలు నెలకు ఒక్కసారి విధిగా సమావేశం కావాలని సూచన చేసింది. దీనిపై మరింత చదవండి :  
Ngt Green Signal Amaravati Buildings National Green Tribunal

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్త డబ్బులు చెల్లించలేదనీ భార్య పైటకొంగుబట్టి లాగిన వ్యాపారి!

కొందరు వ్యాపారుల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. భర్త తీసుకున్న బాకీ చెల్లించలేదన్న ...

news

అది జరిగితే.. ముందు మునిగేది మంగళూరే.. నాసా

అంటార్కిటికా, గ్రీన్ లాండ్ మంచు కరిగితే.. ముందు మునిగేది మంగళూరేనని గ్రెడియంట్ ఫింగర్ ...

news

రెడ్డా.. మజాకా : ములాఖత్‌లతో సెటిల్‌మెంట్లు చేస్తున్న మాజీ ఏఎస్ఐ

అక్రమదందాకు కేరాఫ్ అడ్రస్‌ మోహన్ రెడ్డి. సస్పెన్షన్‌కు గురైన ఏఎస్ఐ. కేవలం ఏడేళ్ళ ...

news

జార్జిబుష్ అసభ్యంగా ప్రవర్తించారు...

హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ త‌మ‌ను వేధించాడంటూ కొంత‌మంది హీరోయిన్లు బయటికొచ్చిన ...