శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (20:31 IST)

గ్యాంగ్‌స్టర్ నయీమ్ మహాముదురు.. చోటా రాజన్, దావూద్‌ల కంటే మించిపోయాడు..

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసుకు సంబంధం ఉన్న వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని, రాజకీయ నేతలైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. నయీమ్ కేసులో 14 మంది పోలీస్ అధికారుల పాత్

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసుకు సంబంధం ఉన్న వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని, రాజకీయ నేతలైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు.  నయీమ్ కేసులో 14 మంది పోలీస్ అధికారుల పాత్ర ఉందని, ఒక మాజీ అధికారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇక కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ నివేదిక ప్రభుత్వానికి అందలేదని, అందిన వెంటనే దోషులపై ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయూమ్ అకృత్యాల గురించి సిట్ అధికారులు ప్రస్తావనకు తెచ్చారు. 
 
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ చేసిన అకృత్యాల కంటే నయీమ్ మించి పోయాడని సిట్ అధికారులు చెపుతున్నారు. ఎన్ఆర్ఐలకు నయీమ్ చుక్కలు చూపించాడని సిట్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఐదుగురు ఎన్ఆర్ఐలు ఈ-మెయిల్స్ ద్వారా తెలిపారని, నయీమ్ బాధితులు ఐదు వేల మందికి పైగా ఉంటారని, పోలీసులను ఆశ్రయించింది మాత్రం కేవలం రెండు శాతమేనని వెల్లడించారు.