శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: గురువారం, 26 మార్చి 2015 (21:56 IST)

కనికరించిన కేంద్రం : పోలవరానికి రూ. 250 కోట్లు విడుదల

పోలవరం ఇక అటకెక్కుతుందని అనుకుంటున్న తరుణంలో కేంద్రం ఆంధ్రప్రదేశపై దయ చూపింది. ఆ ప్రాజెక్టు రూ. 250 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యేక అవసరాల కింద ఈ నిధులను విడుదల చేశారు. బడ్జెట్ లో కేవలం 100 కోట్లను కేటాయించడంతో కేంద్రంపై అనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో భారతీయ  జనతా పార్టీ తమ నాయకుల నుంచి కూడా నివేదికలు తెప్పించుకుంది. 
 
భారతీయ జనతాపార్టీ ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేశారు. అనంతరం పోలవరం యొక్క ప్రాముఖ్యతను కేంద్రానికి వివరించారు. చివరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి వివరించారు. అంతకు మునుపే కనీసం వెయ్యికోట్లు విడుదల చేస్తారని బిజేపీ నాయకులు చెప్పారు. అయితే ప్రస్తుతానికి ప్రత్యేక అవసరాల కింద రూ.250 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. 
 
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో నిధులు అనుకున్న స్థాయిలో విడుదల కాకపోవడంతో ఇక ప్రాజెక్టు అటకెక్కుతుందేమోననే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పట్టిసీమను ముందుకు తీసుకురావడంతో మరిన్ని అనుమానాలు తెలెత్తాయి. ఇలాంటి తరుణంలో పోలవరం ప్రాజెక్టుకు రూ. 250 కోట్లు విడుదల కావడంతో ప్రాజెక్టు సజీవంగానే ఉన్నట్లు భావించవచ్చు.