శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 30 మే 2016 (10:24 IST)

నెల్లూరులో సూర్యుడి ప్రతాపం.. పదేళ్ళనాటి బండరాయి పగిలిపోయింది!

వేసవికాలం మంటెక్కిపోతోంది. భానుడి తీవ్రతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఠారెత్తిపోతున్నారు. కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఫలితంగా.. తెలంగాణ ప్రజలు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలకు తోడుగా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్నా కూడా సూర్యతాపాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం ఏడు గంటలైనా వాతావరణం చల్లబడడం లేదు. 
 
కాగా రోహిణి కార్తెలో కాసే ఎండలకు రోళ్లు పగులుతాయని సామెత ఉంది. ఇప్పుడది సాక్షాత్తుగా నిజమైంది. భానుడి ప్రతానికి రోళ్లు కాదు పెద్ద కంకుల గుండు నిలువునా ముక్కలైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం ముస్తాపురంలో దశాబ్దాల క్రితం నాటి కంకులు గుండు ఎండలకు రెండు ముక్కలైంది. కాగా నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, మర్రిపాడు, ఉదయగిరి, అనంతసాగరం ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.