ఫేస్ క్రీమ్ కొనేందుకు మెడికల్ షాపుకు వెళ్తే... బాలిక వద్ద అసభ్యంగా ప్రవర్తించి?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:22 IST)

మెడికల్ షాపుకు వెళ్లిన బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలి మేనమామ ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాదులోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలో నివసిస్తున్న ఓ వ్యక్తి కుమార్తె (12)ను ఇంటి యజమాని ఫేస్ క్రీమ్‌కు తీసుకురమ్మని మెడికల్ షాపునకు పంపింది. 
 
బాలిక వెళ్లిన మెడికల్ షాపులో ఈసీఐఎల్‌లో నివసిస్తూ అనంతపురానికి చెందిన రామలింగేశ్వర్‌రెడ్డి(22) పనిచేస్తున్నాడు. ఫేస్ క్రీమ్ తీసుకునేందుకు వచ్చిన బాలికపై రామలింగేశ్వర్ రెడ్డి కన్నుపడింది. బాలికకు ఫేస్‌క్రీమ్‌ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే బాలిక అతని నుంచి తప్పించుకుని ఇంటికెళ్లి ఈ విషయం చెప్పింది. దీంతో రామలింగేశ్వర్ రెడ్డిపై బాలిక మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :  
Neredmet Hyderabad Crime News Girl Face Cream Police Station

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్మార్ట్ ఫోన్ కోసం కన్నబిడ్డను తెగనమ్మాడు...

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరి చేతిలనూ ఈ ఫోన్ కనిపిస్తోంది. ...

news

రూ.10 కోట్ల వ్యయంతో బోన్స్ బ్యాంక్ ... డేరా బాబా రూ.25 లక్షల విరాళం

సిర్సాలోని డేరా సచ్చా సౌధా ఆశ్రమంలో ఎముకల బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆ ఆశ్రమ చీప్ గుర్మీత్ ...

news

ఉద్దాన ప్రజల కిడ్నీ సమస్యకు తాగునీరు కారణం కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజల కిడ్నీ సమస్యలకు తాగునీరు ...

news

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఢిల్లీలోనూ అవమానమే... ఇక నూకలు చెల్లినట్టే...

తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ...