గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (11:24 IST)

"గే"లకు వ్యతిరేకంగా చట్టాలు.. పూర్తి పక్షపాతం చూపేలా ఉన్నాయ్: కుక్

'గే' (స్వలింగ సంపర్కుల)లకు వ్యతిరేకంగా అమెరికా ఖండంలోని పలు దేశాల్లో చట్టాలున్నాయని ఆపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ చెప్పారు. ఇలాంటి చట్టాలు స్వలింగ సంపర్కుల విషయంలో పూర్తి పక్షపాతం చూపేలా చేస్తాయని, సమానత్వాన్ని హరిస్తాయని కుక్ అభిప్రాయపడ్డారు. ఆపిల్ సంస్థలో అత్యంత ముఖ్యమైన కార్యవర్గంలో చీఫ్గా పనిచేస్తున్న టిమ్ కుక్ తాను స్వలింగ సంపర్కుడినని స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో... వాషింగ్టన్ పోస్ట్కు రాసిన వ్యాసంలో గేల చట్టాలపై ప్రస్తావించారు. 
 
మతపరమైన స్వేచ్ఛ పేరుతో పలు దేశాలు స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కుక్ తెలిపారు. అలాగే గేలకు ప్రతికూల చట్టాలు చేస్తున్నాయని, దీనివల్ల అత్యంత ముఖ్యమైన సమానత్వం సాధ్యం కాదని కుక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియానా వంటి దేశాల్లో స్వలింగ సంపర్కులతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించబోమని చెప్పడం.. పాశ్చాత్య దేశాలు ఎంతటి అపాయకరమైన స్థితిని ఆహ్వానిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి చర్యలు అమెరికాలోని పలు దేశాల్లో జరగడం చాలా దురదృష్టకరం అని వాపోయారు.