గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (09:05 IST)

బార్..! భరిస్తావా..!! ఎక్కడ కావాలి...? ఎంజాయ్..! తెలంగాణలో అదనంగా 100 బార్లు

రాష్ట్రం విడిపోయింది. పన్నులు వేరయిపోయాయి. ఇటు చూస్తే ఖర్చులు పెరిగిపోతున్నాయ్... ఏం చేయమంటారు..? అని సర్కారు వారిని అధికారులు అడిగితే.. ఆదాయమెక్కడుంది...? ఇంకెక్కడ..? కిక్కెక్కించుకునే మందు బాబు మన దేవుళ్ళు అని తేలింది. ఇక అంతే తెలంగాణ రాష్ట్రం జనాభా లెక్కలు తీసింది. తాగుబోతుల పర్సెంటేజ్ గణించింది. బార్ల అనుమతులకు తలుపులు బార్లా తెరిచేసింది. అదనంగా 100 బార్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. 
 
2001 జనాభా లెక్కల ప్రకారమే ఇప్పటివరకు బార్లకు లైసెన్సులను కేటాయిస్తూ వస్తున్నారు. 2011 లెక్కల తర్వాత నగరాలు, పట్టణాల జనాభా పెరగడం... చిన్న పంచా యతీలు మేజర్‌ పంచాయతీలుగా, మేజర్‌ పంచాయతీలు మునిసిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో ఆబ్కారీ శాఖ బార్ల అనుమతులపై పునః సమీక్ష చేస్తోంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఉన్న 725 బార్‌ దుకాణాలకు తోడు అదనంగా మరో 100 బార్లను అనుమతించేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. 10 జిల్లాల్లలోని నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లనుంచి వస్తున్న డిమాండ్‌ కారణంగానే అధికారులు నివేదిక సిద్దం చేసినట్లుగా తెలిసింది. ఇప్పటికే నూతనంగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, నగర పంచా యతీలలో బార్ల అనుమతి ఫైల్‌ ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉంది. 
 
2011 జనాభాకు అనుగుణంగా బార్‌ పాలసీని అమలుచేయాలని...మరిన్ని బార్లకు అనుమతులు ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం ప్రకటిం చేందుకు సన్నద్దమవుతోంది. ఇప్పటికే నాతన బార్‌ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం అదే దూకుడుతో కొత్త బార్లకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 725 బార్లు మద్యం విక్రయాలు కొనసా గిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే విస్తరించి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది.
 
తాజాగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 25లక్షల రుసుమును కొత్త పాలసీలో అలాగే కొనసాగించగా, మండల కేంద్రాల్లో ఉన్న రూ. 28లక్షలను రూ. 35 లక్షలకు, మునిసిపాలిటీల్లో రూ. 31లక్షలుగా ఉన్న రుసు మును రూ. 38లక్షలకు చేశారు. ఇటు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అటు మందుబాబుల మోజూ తీరుతుంది.