Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా అల్లుడు మాజీ ప్రియురాలితో పారిపోయాడు... కానీ అతడే కావాలి, అత్తమామల ఫిర్యాదు

శుక్రవారం, 9 జూన్ 2017 (19:04 IST)

Widgets Magazine

వాడు మామూలోడు కాదు. వరసబెట్టి ఇద్దరమ్మాయిలను ప్రేమంటూ బుట్టలో పడేశాడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో రొమాన్స్ చేస్తూ ఇద్దరినీ లోబరుచుకున్నాడు. మొదటి ప్రియురాలి కంటే రెండో ప్రియురాలు కాస్త వేగం పుంజుకుని పెళ్లి ప్రపోజల్ పెట్టింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా పెద్దమనసుతో అంగీకరించారు. దీనితో ఇద్దరికీ జూన్ నెల 2న వివాహం చేశారు. ఐతే అతడికి మళ్లీ మొదటి ప్రియురాలు గుర్తొచ్చింది. అంతే ఆమెతో చెక్కేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో ఓ యువకుడు పొరుగింటి అమ్మాయిని ప్రేమించాడు. ఇంతలో ఇటీవలే గుంటూరు నుంచి ఓ కుటుంబం వలస వచ్చింది. ఆ కుటుంబంలోని అమ్మాయిని కూడా ప్రేమించాడు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇద్దరితోనూ రొమాన్స్ సాగించాడు. 
 
రెండో ప్రియురాలు పెళ్లి అంటూ అతడికి కండిషన్ పెట్టడంతో పెద్దల అంగీకారంతో ఆమెను మనువాడాడు. జూన్ 2న పెళ్లయింది. ఐతే పెళ్లయి వారం రోజులు కూడా గడవక ముందే చెప్పా పెట్టకుండా పారిపోయాడు. ఎక్కడికెళ్లాడని ఆరా తీస్తే మొదటి ప్రేమికురాలిని తీసుకుని వెళ్లిపోయినట్లు కనుగొన్నారు. దీనితో అతడి భార్య(రెండో ప్రియురాలు) తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలనీ, కేసులేమీ పెట్టబోమనీ, తమ అల్లుడిని తమకు అప్పగిస్తే చాలని కోరారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Crime Escape Ex-lover Married Groom

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాపట్లలో ఏం జరుగుతోంది? 6 నెలల్లో 16 మంది అమ్మాయిలు ఎందుకెళ్లిపోయారు?

బాపట్ల మండలంలో ఇటీవలి కాలంలో వరుసగా 13 మంది అమ్మాయిలు మిస్ అవడం సంచలనం సృష్టిస్తోంది. అది ...

news

షాక్.. ఇంటర్ టాపర్ విద్యార్థి సన్యాసం స్వీకరించాడు... ఎందుకో తెలుసా?

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి 17 యేళ్ళ వయసుకే సన్యాసం స్వీకరించాడు. ఆ ...

news

ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ ఎవరితోనో తెలుసా... ఈలలు... చప్పట్లు(వీడియో)

వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లోకి రాకముందు సినీ నటి అని తెలిసిందే. ఈమె మాటలంటే ...

news

జగన్ అధికారంలోకి వస్తే సూసైడ్ చేసుకుంటాం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

Widgets Magazine