శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (15:25 IST)

ఏపీకి ప్రత్యేక హోదా.. ఆ రాష్ట్ర హక్కు : నిర్మలా సీతారామన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దాని హక్కు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని ఆమె మరోమారు పునరుద్ఘాటించారు. అయితే ఇందుకుసమయం పడుతుందన్నారు. తాము కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటు అవుతున్న రాజధాని నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించామని ఆమె తెలిపారు. విజయవాడలో ఎన్ఐడీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. హోదా విషయంలో తీవ్ర విమర్శలకు గురి అవుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆసక్తికరమైనవే. నిజంగానే కేంద్రం ఎపికి హోదా ఇస్తే అంతకన్నా కావల్సింది ఏముంటుంది.
 
అయితే, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఇతర రాష్ట్రాలకు ఏమాత్రం సంబంధం లేకున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చేతులు కట్టేస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ ఏపీకి అందించి తీరతామన్నారు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కూడా దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం దేశంలోని పలు రాష్ట్రాలు కోరుతున్నాయని వివరించారు. అయినా, ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ప్రశ్నిస్తున్నారని నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.