గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 మే 2015 (14:15 IST)

అమెరికా ఆరోపణలకు నిర్మలా సీతారామన్ కౌంటర్!

అంతర్జాతీయ మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) నిబంధనలను భారత్ పాటిస్తుందని.. ఈ వ్యవహారంలో ఎవరూ ఇండియాను ప్రశ్నించాల్సిన అవసరమే లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇండియాతో పాటు మరో 11 దేశాలు అమెరికాకు చెందిన ఐపీఆర్‌‍లను నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారని అమెరికా సంస్థ నివేదిక ఇచ్చిన విషయమై ఆమె స్పందించారు. 
 
ఈ విషయంలో ఇండియా ప్రయోజనాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకోబోమని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇప్పటివరకూ ఇండియాపై ఇంటర్నేషనల్ కోర్టులో ఐపీఆర్ హక్కులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సరికొత్త ఆలోచనల దిశగా భారత్ మరింత ముందడుగు వేయాల్సి వుందని అన్నారు.