గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (16:27 IST)

ఏపీకి అంబాసిడర్ అక్కర్లేదు: చంద్రబాబు కామెంట్

తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ తార సానియా మీర్జా నియామకమైన సంగతి తెలిసిందే. ఇక ఏపీ బ్రాండ్ అంబాసిడర్ నియామకం గురించి విలేకర్లు ప్రస్తావించగా.. ఆంధ్రప్రదేశ్‌కు అంబాసిడర్ అక్కర్లేదని బాబు స్పష్టం చేశారు. ఏపీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారనే వార్తల నేపథ్యంలో వ్యత్తులను బట్టి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నందువల్లనే కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా నాడు బిల్ క్లింటన్ హైదరాబాదుకు వచ్చారని చంద్రబాబు అన్నారు. ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం శుక్రవారం ఉదయం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.