శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (11:41 IST)

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదు: కేసీఆర్

ఏపీ సీఎం చంద్రబాబుతో విద్యుత్ అంశంపై చర్చించేందుకు తాను సిద్ధమని... విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద అయినా, అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వద్ద అయినా బాబుతో చర్చకు తాను రెడీ అని... ఎక్కడ చర్చిద్దామో ఆయననే డిసైడ్ చేయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 
 
శ్రీశైలంలో తాము 900 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటే... తెలంగాణకు కేవలం 300 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని... దీనికి తాము ఎలా ఒప్పుకుంటామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 
 
ఎన్ని అడ్డంకులు సృష్టించినా... శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు కూడా వెళతామని తెలిపారు.
 
తెలంగాణలో 250 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అంటున్నారని... అంతమంది అఘాయిత్యానికి పాల్పడినట్టు తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఆంధ్రలో 1500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేసీఆర్ ఆరోపించారు.