గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (15:20 IST)

ఏపీలో 24 గంటల విద్యుత్: కేంద్రంతో కుదిరిన ఒప్పందం!

ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటలూ విద్యుత్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించారు. 
 
దీంతో అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏపీలో నిరంతరాయ విద్యుత్ అమల్లోకి రానుంది. అలాగే 6,500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. 
 
ఇంకా విశాఖలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.