శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (15:42 IST)

జగన్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ కొట్టివేత.. ప్రాథమిక ఆధారాలున్నాయ్..

వైసీపీ అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా నందిగామలో అధికారులపట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై జగన్‌పై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టివేయవలసిందిగా ఆయన క

వైసీపీ అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా నందిగామలో అధికారులపట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై జగన్‌పై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టివేయవలసిందిగా ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం కేసు కొట్టివేతకు నిరాకరిస్తూ క్వాష్ పిటిషన్‌ని తిరస్కరించింది.
 
ఇంకా కలెక్టర్ల పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నందున ఈ పిటిషన్ కొట్టివేసేందుకు నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. కేసును ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది. కృష్ణా జిల్లా నందిగామ వద్ద ఓ ప్రైవేటు బస్సు ప్రమాదం జరిగిన తరువాత, అక్కడికి వెళ్లిన జగన్ ఆసుపత్రిలో కలెక్టర్, వైద్యులపై దురుసుగా ప్రవర్తించినట్టు జగన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
 
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించడానికి జగన్ వెళ్లగా.. పోస్టు మార్టమ్ రిపోర్టుపై కలెక్టర్‌తో వాగ్వాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయకుండా తరలిస్తుండటాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. 
 
ఇదే క్రమంలో ఆ మృతదేహానికి సంబంధించిన పేపర్లను డాక్టర్ వద్ద నుంచి లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద ఓ కలెక్టర్ పట్ల, డాక్టర్ పట్ల జగన్ అలా వ్యవహరించడంపై అప్పట్లో అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.