గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (11:51 IST)

ఓవోబీలో టెన్షన్.. టెన్షన్.. మావో అగ్ర నేత ఆర్కేను రక్షించిన గన్‌మెన్లు... ముమ్మరంగా గాలింపు

ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు చెపుతున్నారు. ప్రస్తుతం ఆయన కోసం ఏవోబీలో ముమ్మరంగా క

ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు చెపుతున్నారు. ప్రస్తుతం ఆయన కోసం ఏవోబీలో ముమ్మరంగా కూంబింగ్ సాగుతోంది. 
 
మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన నక్సలైట్ల సంఖ్య 31కి చేరింది. పోలీస్ కాల్పుల్లో అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే గన్‌మెన్లు ముగ్గురు మరణించారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆర్కేను ఆయన మరో గన్‌మెన్ ఉన్నపళంగా ఎత్తుకొని వెళ్లాడు. ఈ క్రమంలో, ఆర్కే గాయపడినట్టు సమాచారం. 
 
కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆర్కే సెక్యూరిటీ సిబ్బంది తమపై కాల్పులు జరుపుతూ, ఆ ప్రాంతం నుంచి ఆయనను తీసుకెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆర్కే ఏవోబీలోని బెజింగి అటవీ ప్రాంతంలోనే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన కోసం 800 మంది గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ఏపీ-ఒడిశా సంయుక్త దళాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఆర్కేను సజీవంగా పట్టుకోవడం లేదా మట్టుబెట్టడానికి ఇదే సరైన అవకాశం అని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.