Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగుదేశం పార్టీ నుంచి పీవీ ప్రధాని అయ్యారట.. నారా లోకేష్ మళ్లీ నోరు జారారు..

బుధవారం, 28 జూన్ 2017 (18:31 IST)

Widgets Magazine

గతంలో డాక్టర్ అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా ఏపీ పంచాయతీ రాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్ మార్చేశారు. అలాగే పల్లెల్లో తాగునీటి సౌకర్యం లేకుండా చేస్తానని కూడా నోరు జారారు. ఇలా తన ప్రసంగాల్లో అప్పుడప్పుడూ తడబడుతూ.. ప్రతిపక్ష నేతల విమర్శలతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కూడా సెటైర్లు కొనితెచ్చుకుంటున్న నారా లోకేష్.. తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కారు. 
 
బుధవారం మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 96వ జయంతి వేడుకల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు నేల నుంచి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారంటూ కొనియాడారు. ఢిల్లీలో ఎంపీలతో కలిసి పీవీకి నివాళులు అర్పించిన నారా లోకేష్.. పీవీ అప్పటి ఆర్థిక సంస్కరణలతోటే ప్ర్రస్తుతం ఫలాలు అందుతున్నాయన్నారు. పీవీ తెలుగు ప్రజల నుంచి ప్రధాని అవుతున్నారనే కారణంగానే.. ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టలేదని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. 
 
అయితే నారా లోకేష్ పీవీ నరసింహారావు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధాన మంత్రి అయ్యారని నోరు జారారు. వెంటనే తన తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేశారు. పీవీ తెలుగు ప్రజల నుంచి ప్రధాని పదవిని అలంకరించారని చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

Azam Khan పిలుపు: సైనికులు అత్యాచారాలకు పాల్పడితే వారి మర్మాంగాలను కోసివేయాలి

మహిళలపై అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత ...

news

సెల్‌ఫోన్ ఛార్జ్ కోసం ఇంటికొచ్చి రేప్ చేయబోయాడు.. బిగ్గరగా కేకలు పెట్టడంతో నిప్పంటించాడు..

అత్యాచారానికి సహకరించలేదన్న పాపానికి ఓ యువకుడు ఓ యువతికి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ...

news

ట్రంప్ కడుపులో పండు పెట్టుకుని మోదీని ఆలింగనం చేసుకున్నారు... నారాయణ(వీడియో)

మోడీ, ట్రంప్‌ల కలయిక చూస్తుంటే సుధీర్ఘ కాల గాఢ ప్రేమికుల్లా కనిపిస్తున్నారని సిపిఐ జాతీయ ...

news

శివాజీ... అనంతపురం నుంచి నేను.. అమరావతి నుంచి నీవు... పని ప్రారంభిద్దాం... పవన్ కళ్యాణ్

నటుడు శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం ...

Widgets Magazine