Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చేతిలో స్టీరింగ్.. కాలికింద ఎక్సలేటర్... 200 కి.మీ స్పీడ్‌తోనే నిషిత్ డ్రైవ్...

గురువారం, 11 మే 2017 (16:43 IST)

Widgets Magazine
car speed

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీ మంత్రి పి. నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మామూలోడు కాదట. చేతిలో స్టీరింగ్.. కాలికింద ఎక్సలేటర్ ఉంటే... కారు 200 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లాల్సిందేనట. ఈ విషయం ఎవరో చెప్పేంది కాదు.. సాక్షాత్ హైదరాబాద్ నగర పోలీసు రికార్డులు చెపుతున్నాయి. 
 
హైదరాబాద్, బంజారా హిల్స్‌లో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నిషిత్ నడుపుతూ వచ్చిన కారు టీఎస్07, ఎఫ్‌కే 7117 కారు ప్రమాదానికి గురైంది. మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో కారులోని నిషిత్‌తో పాటు.. అతన్ని స్నేహితుడు దుర్మరణంపాలయ్యారు. ఈ ప్రమాదానికి గురైన బెంజ్‌ కారు వేర్వేరు సందర్భాల్లో పరిమితికి మించి వేగంగా వెళ్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు స్పీడ్‌గన్‌తో గుర్తించారు. 
 
ఈ యేడాది మార్చి 10వ తేదీ వరకు మూడు నెలల్లో మూడుమార్లు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తున్నట్లు గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు రూ.4305 ఫైన్‌ వేశారు. చివరగా మార్చి 10న కూడా మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిషిత్‌ కారు ఓవర్‌ స్పీడ్‌ను గుర్తించి ఫైన్‌ వేశారు. 
 
సరిగ్గా రెండు నెలలకు, అంటే ఈనెల 10వ తేదీ బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంతో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలోనూ కారు గంటకు 210 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఉండివుంటాడని, అందుకే నిషిత్‌, అతని స్నేహితుడు ప్రమాదం నుంచి బయటపడేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోయిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి నారాయణ లండన్‌లో ఉన్నారు. ఆయన ఈ వార్త విని కుప్పకూలిపోయారు. అయితే ఇండియాకి వచ్చిన నారాయణ కొడుకు మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడని తనకు తెలియదని, తెలిసి ఉంటే వారించేవాడినని నారాయణ ఉద్వేగానికి లోనయ్యారు.
 
తనతో కలిసి ప్రయాణించినప్పుడు మామూలు వేగంతోనే వెళ్లేవాడని, అందుకే తానెప్పుడు అనుమానించలేదని మంత్రి నారాయణ చెప్పారు. అప్పటికీ వేగంగా వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించానని ఆయన తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'ఆర్థిక ఉగ్రవాది'ని ప్రధాని కలుసుకోవడం దురదృష్టకరం : టీడీపీ ఎమ్మెల్సీ

ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రపడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

news

మహిళలపై రేప్‌లను ఆపలేం.. ఇళ్లకు తాళాలేయమంటారా...?

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆపడం ఎవరివల్లా కాదంటూ భాజపా నాయకుడు, రాజస్థాన్ మంత్రి ...

news

సోనియాకు ఏమైంది? ఐదు రోజులుగా ఆస్పత్రిలోనే.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి పాలయ్యారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ...

news

తమిళనాట రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా తలైవా!

తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకానుందా? అవుననే అంటున్నారు తమిళ సూపర్ స్టార్ ...

Widgets Magazine