సుంజువాన్ ఆర్మీ క్యాంపు దాడికి ప్రతీకారం తప్పదు : నిర్మలా సీతారామన్

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (11:33 IST)

nirmala sitharaman

జమ్మూకాశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర రక్షణ నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు మృతిచెందిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, ఈ దుస్సాహసంపై పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
 
పాకిస్థాన్ వెనకేసుకొస్తోన్న జేఈఎమ్ ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిందన్నారు. ప్రతి దాడులు జరిపిన భారత ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిందని చెప్పారు. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారన్న దానిపై తాము ఇప్పటికే ఆధారాలు సంపాదించామని, పాక్ ప్రభుత్వానికి వాటిని పంపుతామని చెప్పారు.
 
తాము ఆధారాలు పంపుతున్నప్పటికీ పాక్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అయినప్పటికీ తాము ఈ సారి కూడా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ ధీటుగా జవాబు ఇస్తూనే ఉందని చెప్పారు. అంతకు ముందు ఆమె జమ్మూలోని మిలటరీ హాస్పిటల్‌కి వెళ్లి సుంజువాన్ ఉగ్రదాడిలో గాయాలపాలైన వారిని కలిశారు.దీనిపై మరింత చదవండి :  
నిర్మలా సీతారామన్ సుంజువాన్ ఆర్మీ క్యాంపు పాకిస్థాన్ Pakistan Warn Nirmala Sitharaman Sunjuwan Army Camp Attack

Loading comments ...

తెలుగు వార్తలు

news

నడుముపై చేయి వేసి, అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధింపులు..

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా భద్రత లేదు. ఢిల్లీ ...

news

కాళ్ళపారాణి ఆరకముందే.. భర్తపై లైంగిక వేధింపుల కేసు...

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నూతన ...

news

కి'లేడీ' ఏఎస్పీ సునీతా రెడ్డి .. ముగ్గురితో వ్యవహారం నడిపిందా?

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగా పని చేస్తున్న సునీతారెడ్డి మామూలు లేడీ ...

news

బుట్టా రేణుకకు లాభాదాయక పదవీగండం..

వైకాపా ఎంపీ బుట్టా రేణుకపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ...