Widgets Magazine

సైనికులకు కేటాయించిన బడ్జెట్లో నుంచి ఇవ్వాలా? ప్రధాని వెటకారం... పల్లె మాట

బుధవారం, 7 మార్చి 2018 (22:49 IST)

Widgets Magazine
Palle

అమరావతి : కేంద్రానికి మన రాష్ట్రంపై అంకితభావం గానీ, అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి గానీ లేదని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి విమర్శించారు. శాసనసభా ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. విభజన హామీలకు సంబంధించిన 19 అంశాలను కేంద్రం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్లి హామీల విషయం గుర్తు చేసి వేడుకున్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. 
 
రాష్ట్రాభివృద్ధికి తాము నిధులు కావాలని కోరితే, సైనికులకు కేటాయించిన బడ్జెట్లో నుంచి ఇవ్వాలా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెటకారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్‌ఖండ్‌కి రూ.20 వేల కోట్లు, ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్‌కు రూ.80 వేల కోట్లు ప్రకటించారని, తమకు ఎందుకు ఇవ్వరో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసి మట్టి కరిచిందని, అదే పరిస్థితి మీకు వస్తుందని హెచ్చరించారు.
 
పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌కు రూ.7740 కోట్లు ఇవ్వాలని, అయితే ఇప్పటికి రూ.4321 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. రాష్ట్రానికి రావలసిన 11 జాతీయ సంస్థలలో ఇంకా 2 పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాజధాని నిర్మించే బాధ్యత తనదేనన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికి భవనాల నిర్మాణానికి కేవలం రూ. 1500 కోట్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.1000 కోట్లు ఇచ్చారని వివరించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలకు విలువ లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. బలం ఉందిగదా అని హామీలు నెరవేర్చకపోతే ప్రజలు దానికి తగిన విధంగా స్పందిస్తారని పల్లె హెచ్చరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

70 ఏళ్ల వయసులో కూడా సీఎం బాబు ఢిల్లీకి 29 సార్లు వెళ్లారు... ఎమ్మెల్యే అప్పలనాయుడు

అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని గజపతినగరం శాసనసభ్యుడు ...

news

భర్త, అత్తమామల ఎదుటే ఉరి వేసుకున్న భార్య.. ఎక్కడో తెలుసా?

పెళ్ళి చేసుకున్న తరువాత అత్తింటికి వెళితే ఆమెను తన కన్నకూతురితో సమానంగా చూసుకోవాలి ...

news

సినీ నటులు రాజకీయ పార్టీ పెడితే అంతేనా? కన్నడ నటుడు ఉపేంద్ర పార్టీ...

కన్నడ నటుడు ఉపేంద్ర.. ఈ పేరు వింటేనే వెరైటీ గెటప్‌లతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే ...

news

ఏపీకి సానుభూతితో నిధులివ్వలేం.. కేంద్రం వద్ద నిధులు పారట్లేదు: జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని.. విభజన హామీలను నెరవేర్చాలని ఏపీ ఎంపీలు ఢిల్లీలో పోరుబాట ...