శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (03:07 IST)

జిల్లాల్లో సమాంతర అభివృద్ధి: మంత్రి పేర్ని నాని

హైపవర్ కమిటి రెండవ సమావేశం విజయవాడ ఏపియస్ఆర్ టిసి సమావేశపు హాలులో ఆర్ధిక మంత్రి మరియు హైపవర్ కమిటీ అధ్యక్షులు బుగ్గన రాజేంద్రనాధ్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది.

సమావేశానంతరం వివరాలను మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వివరించారు. బిసిజి, జియన్. రావు కమిటీ నివేదికలతో పాటు శివరామకృష్ణణ్ కమిషన్ నివేదికలను, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, సలహాల పై హైపవర్ కమిటి క్షుణ్ణంగా చర్చజరి పిందని మంత్రి వెల్లడించారు.

అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతుల ప్రయోజనాలను కాపాడాలనే దానిమీద చర్చ జరిగిందన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సభ్యుల మధ్య గట్టి చర్చ జరిగిందన్నారు. పరిపాలనే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ ఎ లా జరగాలనే దాని పై కూడా చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అభివృద్ధి సమాంతరంగా, సమంగా జరగాలని, అభివృద్ధి కేంద్రీకృతం కావడం వలన మనం ఎ ంత నష్టపోయామో గడిచిన చరిత్ర చెబుతున్నదని మంత్రి తెలిపారు.

అందువల్ల భవిష్యత్తులో ఎటువంటి నష్టం జరగకుండా ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలు పెంపొందే అవకాశాలు రాకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, పరిపాలన అన్నిచోట్ల సమపాళ్లల్లో కేంద్రీకృతం కావాలనే అంశాలపై కమిటి చర్చించదన్నారు. ఈనెల 13న మరోసారి హైపవర్ కమిటీ సమావేశమై దాదాపు ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉందన్నారు.

ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, సూచనలు, డిమాండ్లను కమిటీ పరిశీ లించి పరిగణనలోనికి తీసుకుని, చర్యలు తీసుకుంటుందని మంత్రి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో డిప్యూటి సియం పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య, కురసాల కన్నబాబు, కొడాలి వెంకటేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, మేకపాటి గౌతం రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజేయ కల్లం, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రాష్ట్ర మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను గుర్తించే హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు. ప్రజల మనోభావాలను గుర్తించే హైపవర్ కమిటీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి మరియు హైపవర్ కమిటి సభ్యులు కురసాల కన్నబాబు తెలిపారు.

రాజధాని రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్దికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల్లో లేనిపోని అపోహల‌తో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. బిసిజి, జియన్. రావు కమిటీ నివేదికలతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకుని కమిటి వాటిపై చర్చిస్తున్నదన్నారు.

ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెంది మిగిలిన ప్రాంతాలు నాశన‌మైపోవాల‌ని చంద్రబాబు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు. రాజధాని అంటే 5 కోట్ల మందికి సంబంధించిందే కానీ కేవలం రెండు జిల్లాలకో, కొన్ని ప్రాంతాలకో పరిమితం అయ్యింది కాదన్నారు. చంద్రబాబు ఏమైనా ఇక్కడ శాశ్వత రాజధాని నిర్మించారా అని ప్రశ్నించారు.

రాజధాని నిర్మాణంకోసం గతంలో ఇటుకలు పేరుతో చందాలు వసూలు చేసారని, ఆనిధులు అన్నీ ఏమయ్యాయని, మరలా ఇప్పుడు ఉద్యమాల పేరుతో జోలిపట్టి ప్రజల జేబుల్లో డబ్బులు లాక్కునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మూడు ప్రాంతాలకు న్యాయం జరి గే విధంగా హైపవర్ కమిటి చర్చ జరుపుతున్నదన్నారు.

మంత్రి మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కులాలవారీగా, ప్రాంతాల వారీగా ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని, 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసారని, ప్రాంతాలవారీగా అసమానతలు తొలగించాలని కమిటి చర్చిస్తున్నదన్నారు.

కమిటీ నిర్ణయం తెలియకుండానే ప్రశాంతంగా ఉన్న ఏపి ని ప్రాంతాలు వారీగా విభేధాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కమిటి నిర్ణయం అనంతరం ప్రతిపక్ష నాయకుడిగా ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తే వాటిని పరిగణనలోనికి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.