మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (12:52 IST)

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందనీ.. తనువు చాలించిన తల్లిదండ్రులు

కన్నబిడ్డ తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కల్వచర్లలో జరిగింది. ఈ వివరా

కన్నబిడ్డ తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కల్వచర్లలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఈ గ్రామంలో వర్రె పర్వతాలు, లక్ష్మిలు దంపతులు ఉన్నారు. వీరికి ఒకే కుమార్తె ఉంది. అయితే, ఈ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి, ఆ పెళ్లికి అంగీకరించలేదు. 
 
కానీ, కుమార్తె మాత్రం ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు పురుగు మందుతాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతిదేహాలను స్వాధీనం చేసుకున్నారు.