గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (11:24 IST)

పాస్‌పోర్టు జారీ నిబంధనలు కఠినతరం... వివరాలన్నీ ఒకేలా ఉండాల్సిందే...

పాస్‌పోర్టు జారీ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తక్షణం పాస్‌పోర్టు కావాలనుకునేవారు ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, ఫొటో గుర్తింపు కార్డు, పాన కార్డుల్లో ఏవైనా మూడింటిన

పాస్‌పోర్టు జారీ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తక్షణం పాస్‌పోర్టు కావాలనుకునేవారు ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, ఫొటో గుర్తింపు కార్డు, పాన కార్డుల్లో ఏవైనా మూడింటిని సమర్పించాలి. పైగా, వీటిలో ఏదేని మూడింటిలో పేరు, ఇతర వివరాలు అన్నీ ఒకేలా ఉండాలి. అప్పుడే పాస్‌పోర్టును పోలీస్‌ తనిఖీకి ముందే జారీ చేస్తారని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్‌పీ చౌదరి తెలిపారు. ఈ పత్రాలతో పాటు తప్పనిసరిగా పుట్టిన తేదీ ధ్రువపత్రం, నాన్ ఈసీఆర్‌ పత్రాలు, అనెక్షర్‌-1 సమర్పించాలని చెప్పారు. 
 
అలాగే, ఇకపై ఎవరైనా పాస్‌పోర్టుకు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే.. వారు సమర్పించే డాక్యుమెంట్ల ఆధారంగా అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయితే చాలు. పోలీస్‌ తనిఖీ పూర్తికాకముందే అంటే దరఖాస్తు పరిశీలన పూర్తయిన రోజే పాస్‌పోర్టు మంజూరు చేస్తారు. అది మూడు రోజుల్లోగా దరఖాస్తుదారుకు చేరుతుంది. ఆ తర్వాత పోలీసు నివేదిక ఆధారంగా ఏమైనా తేడావుంటే షోకాజ్‌ నోటీసు ఇచ్చి విచారణ చేస్తారు. ఈ కొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నుంచి అమల్లోకి తెస్తున్నారు.