శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:42 IST)

వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్: కోడిగుడ్ల ఉత్పత్తిలో ఫస్ట్ మనమే!

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఏంటంటే.. విభజన తర్వాత కూడా కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నామని గర్వంగా చెప్పుకున్నారు. అలాగే మాంసం ఉత్పత్తిలో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. 
 
ఇంకా.. 
* రైతులకు రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం
* మత్స్య ఉత్పత్తుల విలువలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నాం
* ఆయిల్ పామ్ సాగుకు రూ. 33 కోట్లు
* ఎత్తిపోతల పథకాలకు రూ. 156 కోట్లు
* గోదాములలో నిల్వ ఉంచిన పంటలపై రైతులకు రుణం
* బిందు సేద్యానికి రూ. 348.33 కోట్లు
* ఐసీడీపీకి రూ. 156. 87 కోట్లు
* రాష్ట్రంలో 4.04 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు
* మత్స్యశాఖకు రూ. 60.07 కోట్లు
* పట్టు ఉత్పత్తిలో ముందుండేందుకు కృషి
* పట్టు పరిశ్రమకు రూ. 122 కోట్లు
* రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కోళ్ల పరిశ్రమకు రూ. 17 కోట్లు
* ఐజీసీఏఆర్ఎల్ కు రూ. 15 కోట్లు
* రైతు బజార్లు, పండ్ల మార్కెట్లలో కోల్డ్ స్టోరేజ్ లు
* రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కు కృషి
 
* 2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 56,019 కోట్లు
* వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ. 50 కోట్లు
* వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీకి రూ. 30.61 కోట్లు
* రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పశు సంవర్ధక శాఖకు రూ. 51.84 కోట్లు
* విద్యుత్ పై రైతుల ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్
* వచ్చే ఐదేళ్లలో కొత్తగా 10 వేల సోలార్ పంపుసెట్లు.. ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.