శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (17:13 IST)

పవన్ కళ్యాణ్ ఎవ‌రిని ప్రశ్నించారు..? ప‌్ర‌జ‌ల‌నా...! పాల‌కుల్నా..! అస‌లు ఆయ‌న ఏం ప్ర‌శ్నించారు..?

పవన్ కళ్యాణ్ వేలెత్తి చూపితే పార్టీలు గెలుస్తాయి. అందుకు బ‌ల‌మైన కార‌ణం ఉంది. ఆయ‌న సినిమా గ్లామ‌ర్‌తోపాటు ఆయ‌న ముక్కుసూటి త‌న‌మే అందుకు కార‌ణ‌మ‌ని జ‌నం న‌మ్మారు.. ఎక్క‌డ తేడా వ‌చ్చిన ప్ర‌శ్నించ‌డానికి తానున్నాన‌ని జ‌నానికి భ‌రోసా ఙ‌చ్చారు. చాలాకాలానికి పవ‌న్ ప్ర‌శ్నించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మ‌య్యింది. అంద‌రూ ప్ర‌శ్నించి.. వ్యాఖ్యానించిన త‌రువాత య‌స్‌..! నేను ప్ర‌శ్నిస్తాన‌ంటూ ముందుకు వ‌చ్చారు. మ‌రి ఆయ‌న ఏం ప్ర‌శ్నించారు..? ఎవ‌రిని ప్ర‌శ్నించారు..? ప‌్ర‌జ‌ల‌నా..! పాల‌కుల‌నా..! చివ‌ర‌కు తేలిందేమిటి?
 
నేరుగా సబ్జక్టులోకి వచ్చేస్తే... ఆయన అన్నదేమిటీ? ఆంధ్రులకు ఇంత భారీ అన్యాయం జరిగిపోయింది... అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అందుకు పరిష్కారం చూపగల భారతీయ జనతాపార్టీని ఒక్కటంటే ఒక్క మాట కూడా ప్రశ్నించలేకపోయారు. కాదంటే, డిమాండ్ కూడా చేయలేకపోయారు ఎందకు..? కానీ ఎంపీలను మాత్రం ఉతికి ఆరేశారు. ప్రజా నాయకుడంటే ఎంపీ మాత్రమే కాదు కదా..పవన్ ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా ఆ పని చేయడం అవసరం లేదా?.. తప్పుచేసినప్పుడూ, అన్యాయం జరిగినప్పుడూ.. నిలదీస్తా.. కడిగేస్తానని చెప్పిన పవన్ ఇక్కడ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
వర్తమాన రాజకీయాలు నీతినిజాయతీకి పుట్టినిల్లు కాదనేది జగమెరిగిన సత్యం. రాజకీయ అవినీతి పేరుకుపోయిందని అన్నట్లు పవన్ మాట్లాడుతున్నారు. అలా పేరుకుపోయిన రాజకీయ అవినీతిపై పోరాడుతా..ప్రశ్నిస్తా అంటేనే కదా యువత పవన్ జనసేన జెండాను భుజంపై మోసింది? మరి ఎందుకు ప్రశ్నించ లేదు.? రాజకీయాలలో అవినీతి జరుగుతోందనేదే కదా ఓటుకు నోటు సారాంశం.. మరి ఆయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు..? రేపు జనసేన తరుపున కూడా అలాంటి అవినీతిని ప్రోత్సహిస్తారని అనుకోవాలా?
 
హైదరాబాద్ నగరంపై ఆయనో పెద్ద కామెంట్ చేశారు. పాతిక ముప్పై ఏళ్ల తరువాత శ్రీలంకలా మారిపోతుందని అన్నారు. అంటే అంతర్యుద్ధం వస్తుందనే కదా.. ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలని అంటున్నారు పవన్. మరి అలాంటపుడు సెక్షన్ 8 ఎందుకు వద్దంటున్నారు..? శ్రీలంకలో ఏం జరిగింది. తమిళనాడు నుంచి వలసవెళ్లిన తమిళులు అక్కడ అధికారం కోసం యుద్ధం చేశారు. ఘర్షణకు దిగారు. అంటే ఇక్కడ సీమాంధ్రులు ఆ బాటలో నడుస్తారనా..? అసలు ఏమిటి మీ ఉద్దేశ్యం? హైదరాబాద్ సమస్యను పెంచాలనా.. తుంచాలనా..?
 
మరో అంశం ఎంపీలు పనిచేయడం లేదు. రాజీనామా చేయాలి అని పవన్ ఉచితంగా ఓ కామెంట్ పడేశారు. బాగానే వుంది. మన ఆంధ్ర ఎంపీలంతా వ్యాపార వేత్తలు అన్నారు.. ఓకే చాలా బాగుంది. మరి వారికోసం ప్రచారానికి దిగినప్పుడు వీరు వ్యాపార వేత్తలని తెలియదా... వారు వ్యాపారవేత్తలు మీరు సినిమా నటుడు ఇద్దరూ పార్ట్ టైమ్ రాజకీయ నాయకులే.. ఏమిటి తేడా..? పివిపి కూడా బడా వ్యాపారవేత్తే. మరి ఆయనకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును ఎందుకు కోరారు? ప్రశ్నిస్తాను.. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ చివరకు జనానికి ప్రశ్నగా మిగిలారనే విమర్శలు చాలా ఉన్నాయి.