ఆత్మకు శాంతి చేకూరాలని చెపితే సరిపోతుందా? జరిగిన నష్టం పూడ్చలేనిది : పవన్

సోమవారం, 13 నవంబరు 2017 (14:41 IST)

pawan kalyan

కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 'మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా'... లాంటి మాటలను చెప్పడం ద్వారా మృతుల కుటుంబాలకు జరిగిన నష్టాన్ని పూడ్చలేమని అన్నారు.ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
ప్రస్తుతం తన కొత్త చిత్రం షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాద వార్తను ఓ మీడియా ద్వారా తెలుసుకుని ప్రకటన చేశారు. చిన్నచిన్న నిర్లక్ష్యాలకు ఎంతో విలువైన ఇన్ని ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలచి వేసిందన్నారు. 
 
ప్రజల ప్రాణాలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగంలోని వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసిందన్నారు. ఇంకోసారి ఇలాంటి సానుభూతి ప్రకటన చేయాల్సిన పరిస్థితి, అవసరం రాకుండా ఉండే పరిస్థితులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ పేర్కొన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

క్రిష్ణానది ప్రమాదంపై కన్నీరు పెట్టుకున్న సిఎం బాబు, విలపించిన నారాయణ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రిష్ణానది వద్ద జరిగిన పడవ బోల్తా ప్రాంతానికి ...

news

నగరి సీటు ఓకే చేయండి, రోజా పని పడ్తా... బాలయ్యతో వాణీవిశ్వనాథ్

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నటి వాణీ విశ్వనాథ్ చేరిక గురించి చర్చ జరుగుతోంది. అందులోను ...

news

ఏపీ టూరిజం అధికారి మొత్తుకున్నా.. దండం పెట్టినా... బోటు తీశారు..

పవిత్ర సంగమం వద్ద బోటు తిరగబడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు ...

news

చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం అదే... పోసాని కృష్ణమురళి

సినిమా ఇండస్ట్రీలో ఉన్నదివున్నట్లుగా చెప్పే నటుల్లో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. ఆయన ...