Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైకాపాపై కోపం లేదు.. హోదా సరే.. ప్యాకేజీ అర్థరాత్రి ఎందుకు ప్రకటించారు: పవన్ ప్రశ్న

మంగళవారం, 31 జనవరి 2017 (18:42 IST)

Widgets Magazine

ప్రత్యేక హోదా ట్వీట్లు చేస్తే సరిపోదని.. ప్యాకేజీపై, హోదాపై అన్నీ తెలుసుకుని మాట్లాడాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జనసేనాని పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియా మాట్లాడుతూ స్పందించారు. వెంకయ్యకు కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాది-దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేయొద్దన్నారు. మతాల ఆధారంగా విభజిస్తే పర్లేదు కానీ.. తాను దక్షిణాది-ఉత్తరాది అని మాట్లాడితే తప్పవుతుందా? అంటూ ప్రశ్నించారు.
 
ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయని, తెలివితేటలు కేవలం నార్త్ బ్లాక్‌లో ఉన్నవారికే పరిమితం కాదని పవన్ సెటైర్లు విసిరారు. తాను కనీసం ట్విట్టర్లోనైనా హోదా కోసం మాట్లాడుతున్నానని, ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పార్లమెంట్‌లో బీజేపీ ఇచ్చిన మాట తప్పిందని పవన్ ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరే, ప్యాకేజీ అర్ధరాత్రి ఎందుకు ప్రకటించారో చెప్పాలని అడిగారు.
 
నాడు ఇందిరాగాంధీ ఓ సంఘటనకు సంబంధించి వచ్చి క్షమాపణ చెప్పి వెళ్లిపోయారని పవన్ గుర్తు చేశారు. అందుకే నేతలు హామీలు నెరవేర్చకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ అన్నారు. చట్టసభల్లో నేతల ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇక వైకాపా అయినా.. ఏ పార్టీతో తనకు వ్యక్తిగత కోపం లేదని.. సీపీఐ రామకృష్ణ గారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని చెప్పారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని పవన్ పిలుపు నిచ్చారు. వ్యక్తిగతంగా తనకు లీడ్ చేసే అనుభవం లేదన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా.. వారానికి ఓసారి చేనేత వస్త్రాలు ధరిస్తా: పవన్

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని, వారానికి ఓసారి చేనేత వస్త్రాలను ధరిస్తానని జనసేన ...

news

బ్రేకింగ్ న్యూస్.. జల్లికట్టు చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో: తమిళ ప్రజలకు మరో విన్

తమిళులు వారం రోజుల పాటు జరిపిన జల్లికట్టు ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ ...

news

భారతీయ ఐటీ కంపెనీలపై డోనాల్డ్ ట్రంప్ పిడుగు... ఉద్యోగుల్లో భయాందోళనలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని యుఎస్ సర్కారు మరో సంచలన నిర్ణయం ...

news

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు.. సెక్స్‌ స్కామ్‌గా మారిపోయిందా? సుభ్ర కుండుకు లింకుందా?

తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎంపీలు జైలు ఊచలు లెక్కించేలా చేసిన రోజ్ వ్యాలీ చిట్ ...

Widgets Magazine