Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా.. వారానికి ఓసారి చేనేత వస్త్రాలు ధరిస్తా: పవన్

మంగళవారం, 31 జనవరి 2017 (18:31 IST)

Widgets Magazine

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని, వారానికి ఓసారి చేనేత వస్త్రాలను ధరిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. చేనేత జాతి సంపద అని.. అదో అరుదైన కళంటూ హైదరాబాదు పార్టీ ఆఫీసులో పవన్ వ్యాఖ్యానించారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగనున్న చేనేత సత్యాగ్రహానికి ముఖ్యఅతిథిగా చేనేత సంఘాలు తనను ఆహ్వానించాయని పవన్ తెలిపారు. తనకు చేతనైనంత వరకు ఇకపై వారంలో ఓ రోజు చేనేత దుస్తులే ధరిస్తానని.. తనలాగే మీరందరూ కూడా వారానికి ఓసారి చేనేత దుస్తులను ధరించాలని సూచించారు. 
 
మిలాన్ లాంటి నగరంలో కశ్మీరీ వర్క్‌ను డిజైనర్లు కొనుగోలు చేస్తారని, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయగల మనవారి నైపుణ్యం వారికి అవసరం ఉంటుందని భావిస్తున్నానని, అలా చేనేతను అంతర్జాతీయ బ్రాండ్‌గా చేసేందుకు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇందుకోసం తన వంతు సాయం చేస్తానని పవన్ చెప్పారు. చేనేత జాతి సంపదని అలాంటి  సత్యాగ్రహ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన వారందరికీ ఈ సందర్భంగా పవన్ ధన్యవాదాలు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్రేకింగ్ న్యూస్.. జల్లికట్టు చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో: తమిళ ప్రజలకు మరో విన్

తమిళులు వారం రోజుల పాటు జరిపిన జల్లికట్టు ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ ...

news

భారతీయ ఐటీ కంపెనీలపై డోనాల్డ్ ట్రంప్ పిడుగు... ఉద్యోగుల్లో భయాందోళనలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని యుఎస్ సర్కారు మరో సంచలన నిర్ణయం ...

news

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు.. సెక్స్‌ స్కామ్‌గా మారిపోయిందా? సుభ్ర కుండుకు లింకుందా?

తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎంపీలు జైలు ఊచలు లెక్కించేలా చేసిన రోజ్ వ్యాలీ చిట్ ...

news

ఒబామా నోరు విప్పారు.. ట్రంప్ నిర్ణయం కోపం తెప్పించింది.. వివక్ష వద్దు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు విధానాలపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోరు ...

Widgets Magazine