బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (09:45 IST)

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారంటే?

వచ్చే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. అదీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బరిలోకి దిగనుంది. ఈ ఎన్నికల్లో 60 శాతం టిక్కెట్లను యువతకే కేటాయించనున్నట్టు జనసేనాని తాజాగా ప్రకటించారు.

వచ్చే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. అదీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బరిలోకి దిగనుంది. ఈ ఎన్నికల్లో 60 శాతం టిక్కెట్లను యువతకే కేటాయించనున్నట్టు జనసేనాని తాజాగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయనున్నారు. అయితే, ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న అంశంపై అపుడే సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
గతంలో అనంతపురంలో జరిగిన ఓ రైతు చైతన్య బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తూ.. తాన ఎన్నికల్లో పోటీ అంటూ చేస్తే అనంతపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకారంగానే ఆయన వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయనున్నారు. దీంతో ఇక్కడి అభిమానులు, పార్టీ శ్రేణులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 
 
అలాగే 60 శాతం పైగా టికెట్లు యువతకు కేటాయిస్తామని చెప్పడం వారిలో మరింత ఉత్సాహం నింపింది. ఎలాగైనా కమిటీలో స్థానం పొందాలనే కుతూహలం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని పవనకల్యాణ్‌ చేసిన ప్రకటనపై కాపు జేఏసీ ఛైర్మన్, జనసేన నాయకులు భవానీ రవికుమార్‌ హర్షం వెలిబుచ్చారు. సంస్థాగత కార్యక్రమాలకు సన్నద్ధమవుతామని ఆయన తెలిపారు.