Widgets Magazine

రూటు మార్చుకున్న పవన్: అనంత కాదు.. కదిరి నుంచి పోటీచేస్తారట? బాలయ్య అంటే భయమా?

సోమవారం, 20 మార్చి 2017 (19:12 IST)

Widgets Magazine
pawan kalyan

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అనంత నుంచి కాకుండా బాగా పట్టున్న నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పవన్ కదిరిని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కదిరితో పాటు తాడిపత్రి, ఉరవకొండ, సింగనమల నియోజక వర్గాల్లో పోటీ చేసే దిశగా పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గుంతకల్లును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
 
అనంతలో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్.. టీడీపీ తరపున హిందూపురం నుంచి అనంతపురంకు బాలయ్య జంప్ కావడంతో రూటు మార్చుకున్నారని తెలుస్తోంది. హిందూపురం అభివృద్ధికి బాలయ్య ఎంతగానో కృషి చేస్తున్నారని, సినిమాలు చేస్తూనే.. తన నియోజకవర్గం అభివృద్ధికి బాగా కష్టపడుతుండటంతో.. ఆయనతో అనంతలో పోటీచేస్తే ఓటర్లు తనకు ఆదరణ చూపే అవకాశం ఉండదని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అందుకే బాలయ్యతో పోటీ ఎందుకని.. పవన్ రూటు మార్చుకున్నట్లు సమాచారం. అందుకే తొలుత అనంతను అనుకున్నా.. ప్రస్తుతం కదిరి వైపు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. సర్వేల ప్రకారం పవన్ కల్యాణ్ నియోజక వర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నట్లు జనసేన పార్టీ వర్గాల సమాచారం. మరి పవన్ ఏ నియోజక వర్గం నుంచి ఫోకస్ చేస్తారో వేచి చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సిగ్గులేక సంబరాలా... నేనిలానే మాట్లాడుతా... సస్పెన్షన్ అంటే కోర్టుకెళతా... ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను ...

news

గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ...

news

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే తంతు.. కొనిపారేశారన్న జగన్.. సింహం సింగిల్‌గానే..?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ ...

news

మనువరాలిపై ఏడాదిపాటు తాత అత్యాచారం.. వేధింపులు తాళలేక బాధితురాలి ఆత్మహత్య

వావివరసలు మంటగలిసిపోయాయి. కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. వయో తారతమ్యం లేకుండా బాలికల ...