శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (17:04 IST)

ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందనే మద్దతిచ్చా : పవన్ కళ్యాణ్ (లైవ్ వీడియో)

విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, నాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్

విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, నాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈనెల ఒకటో తేదీన విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌పై పవన్ కళ్యాణ్ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పై విధంగా వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, కొద్ది రోజులుగా బీజేపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న పరిణామాలే దీనికి కారణమని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్‌లోనూ, బయటా ఎంపీలు పోరాటం చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడంతో ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.