Widgets Magazine

జేపీ కోసం జనసేనాని : కదనరంగంలోకి దూకిన పవన్ కళ్యాణ్

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (15:37 IST)

jp - pk

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక సంయుక్త కార్యారణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేయదలచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 24 గంటలు తిరగకముందే కదనరంగంలోకి దూకారు. ఇందులోభాగంగా, ఆయన గురువారం లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌‌తో భేటీ అయ్యారు. జేపీతో మూడు గంటలకు పవన్ భేటీ కావాల్సి ఉండగా, 2 గంటల 55 నిమిషాలకే జేపీ ఆఫీస్‌కు జనసేనాని చేరుకోవడం గమనార్హం. 
 
కాగా, బుధవారం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ, విభజన హామీలను నెరవేర్చడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అలాగే, పలు అంశాలపై అధికార టీడీపీ నేతలు కూడా భిన్నరకాలుగా స్పందిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని కూడా పరోక్షంగా తప్పుబట్టారు. 
 
అదేసమయంలో ఏపీ హక్కుల సాధన కోసం జేఏసీని ఏర్పాటు చేస్తానని, ఇందుకోసం తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఆ ప్రకారంగానే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. ఇందులోభాగంగా, తొలుత లోక్‌సత్తా అధినేత జేపీతో సమావేశమయ్యారు. అలాగే, ఈనెల 11వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీకానున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
పవన్ కళ్యాణ్ జయప్రకాష్ నారాయణ్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ Jac Pawan Kalyan Andhra Pradesh Jayaprakash Narayan

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ లీడర్స్ గజ మోసగాళ్లు : టీడీపీ ఎంపీలు

భారతీయ జనతా పార్టీతో ఉన్న స్నేహ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి అధికార తెలుగుదేశం ...

news

సేఫ్ శృంగారం అయితే ఓకే... యువ స్కాలర్‌కు పీహెచ్‌డీ విద్యార్థిని ఆఫర్

హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి. ...

news

చేపల కూర వండటం రాదని గొడవపడ్డ భర్త- భార్య ఏం చేసిందంటే?

భర్తతో చేపల కూర వండటం రాదని చెప్పింది ఓ భార్య. అంతే కోపంతో భర్త గొడవపడ్డాడు. అంతే ...

news

ముద్దుక్రిష్ణమ నాయుడు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి లోటు... రోజా(Video)

తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు భౌతిక కాయాన్ని చూసిన వైసిపి ...

Widgets Magazine