గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (19:54 IST)

పవన్ కల్యాణ్ అనంత సభ: జనసేనకు పనికొస్తుందా? ప్రజలకు మేలు చేస్తుందా? హోదా గోవిందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనంతపురం వేదికగా మూడో బహిరంగ సభకు పక్కా ప్లాన్ చేసుకున్నారు. తొలి సభను తిరుపతిలో రెండో సభను కాకినాడలో నిర్వహించిన పవన్ కల్యాణ్ మూడో సభను అనంతపురం వేదికగా జరిపేందుకు సన్నద్ధమవు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనంతపురం వేదికగా మూడో బహిరంగ సభకు పక్కా ప్లాన్ చేసుకున్నారు. తొలి సభను తిరుపతిలో రెండో సభను కాకినాడలో నిర్వహించిన పవన్ కల్యాణ్ మూడో సభను అనంతపురం వేదికగా జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు. తొలి సభలో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వినిపించేలా హిందీలో మాట్లాడిన పవన్ కల్యాణ్, రెండోసారిగా కాకినాడలో జరిగిన సభలో భారాన్నంతా పార్టీలపై వేసేసి చేయి దులుపుకున్నారు. ఇక మూడో సభలో పవన్ ఏం అంశంపై మాట్లాడుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ప్రత్యేక హోదా లేదని.. అంతకుమించిన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించిన వేళ.. సాంకేతిక కారణాలతో హోదా గాలికెగిరిపోవడంపై పవన్ రెండో సభలోనే సాదాసీదాగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో హోదాపై పవన్ ఏం మాట్లాడుతారు అనేది సస్పెన్స్‌గా మారింది. 
 
జనసేన వర్గాల సమాచారం మేరకు.. పార్టీ విస్తరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరాన్ని ప్రజలకు పవన్ తెలియజెప్తారని తెలుస్తోంది. సామాజిక సమస్యలపై అనంతపురంలో పవన్ వివరిస్తారని తెలుస్తోంది. ఈ సభను నవంబర్ 10న నిర్వహించనున్నారు. కరవు జిల్లా అనంతపురంను పవన్ కల్యాణ్ ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే కనబడుతోంది. 
 
సమైక్యాంధ్ర ఉద్యమం అనంతపురం జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిపడిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ఏపీకి ప్రత్యేకహోదా కావాలన్న డిమాండ్ కూడా భారీ ఎత్తున వినిపించింది. మూడో బహిరంగ సభ జనసేన పార్టీకి రాజకీయ పరంగా సహకరిస్తుందని.. అందుకే పవన్ అనంతలో ఈ సభను పెట్టేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

కాగా మూడు సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మధ్య మధ్యలో తన పార్టీ అభివృద్ధితో పాటు ప్రజల మేలు కోసం పనులు చేపడుతున్నారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.