గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (11:23 IST)

పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారా?

జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారా? తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మెదక్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ప్రచారంలో పాల్గొనకపోవచ్చని సమాచారం. 
 
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగళూరులో వెన్నునొప్పికి చికిత్స పొందుతున్నారని, ఎన్నిక జరిగేలోపు ఆయన హైదరాబాద్ రాకపోవచ్చని చెబుతున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పక్షాన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోటీచేస్తున్నారు. ఆయన పక్షాన పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయవచ్చని ఆశించారు. 
 
ఇప్పుడు ఇది కొంత నిరాశ కలిగించే అంశమైనా తాము ప్రచార వ్యూహాన్ని సొంతంగా రచించుకుంటామని బిజెపి నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తనకు వెన్ను నొప్పి కారణంగా బెంగలూరులో ఉన్నట్లు ఎస్.ఎమ్.ఎస్.పంపినట్లు చెబుతున్నారు. 
 
కాగా జగ్గారెడ్డి పోటీ వెనుక పవన్ కళ్యాణ్ చొరవ కూడా ఉందని కొందరు చెబుతున్నారు. అందువల్ల ఇంకా సమయం ఉంది కనుక పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా ఒకటి, రెండు ర్యాలీలలో పాల్గొనకపోతారా అన్న అభిప్రాయం కూడా లేకపోలేదని అంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే అడ్డుకుంటామని టీఆర్ఎస్‌కు చెందిన ఓయూ జేఏసీ నేతలు కొందరు హెచ్చరించారు.