గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 మే 2018 (11:09 IST)

లాంచీ ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. ఏమన్నారంటే...

గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రయాణికులతో వస్తున్న లాంచీ మునిగి దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు.

గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రయాణికులతో వస్తున్న లాంచీ మునిగి దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
 
అలాగే భారీ క్రేన్ల సాయంతో లాంచీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేగాక నేవీ, ఎన్డీఆర్ఎప్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇదిలావుంటే లాంచీ మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం 20 పడవలతో గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
 
ఇదిలావుండగా, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. లాంచీ ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలవాలని పవన్‌ కోరారు.