Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పీకేజీ.. ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు?: శ్రీరెడ్డి

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (15:15 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించింది. టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌పై పవన్ స్పందిస్తూ.. శ్రీరెడ్డి తెలిపే నిరసన తీరు తప్పని, వేధింపులు ఎదుర్కొని ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలియజేస్తున్న పవన్ కల్యాణ్.. కోర్టుకు లేదా పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లట్లేదని అడిగింది. పీకేజీ.. ఆంధ్రప్రదేశ్ కోసం మీరెందుకు తెలియజేస్తున్నారని శ్రీరెడ్డి ప్రశ్నించింది. హోదా కోసం పోలీస్ స్టేషన్‌కో లేకుంటే కోర్టుకో వెళ్లొచ్చు కదా అంటూ ప్రశ్నస్త్రాలు సంధించింది. 
 
తాము కూడా మీలానే, తెలుగు అమ్మాయిల స్వాతంత్రం కోసం, కాస్టింగ్ కౌచ్ నిర్మూలన కోసం పోరాడుతున్నామని గుర్తు చేసింది. వారిపై కనీస గౌరవం కూడా మీకు లేదా? అమ్మాయిలెవ్వరూ పీకేల సపోర్టు కోరుకోవడం లేదు. మీరేమీ బలవంతంగా నోరు తెరచి మాట్లాడక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఇది సిగ్గు చేటని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసింది. ఇకపై హోదాపై పోరాటం చేయాలనుకుంటే పవన్ కల్యాణ్ కోర్టులకో, పోలీస్ స్టేషన్లకో వెళ్ళాలని.. టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని చెప్పింది. 
 
పనిలో పనిగా మా పెద్దలు తక్కువేం కాదని శ్రీరెడ్డి తెలిపింది. మా పెద్దలు కూడా లైంగికంగా వేధించే వారేనని, మా అసోసియేషన్ లోనూ వేధింపులకు పాల్పడే వారు ఉన్నారని.. ఇందులో భాగంగా ఎవరైనా దొరికితేనే దొంగలని క్యారెక్టర్ నటి శ్రుతి ఓ టీవీ చానల్ చర్చలో ఆరోపించిన సంగతిని శ్రీరెడ్డి స్పందించింది. 
 
"ది గ్రేట్ మా అధ్యక్షుడు శివాజీ రాజా గారూ... మీ టోకెన్ నంబర్ వచ్చింది. పదిమందికి న్యాయం చేయాల్సిన కుర్చీలో ఉండి ఈ రాసలీలలు ఏంటండీ?" అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, మా అధ్యక్ష పదవికి శివాజీ రాజా అనర్హులని వ్యాఖ్యానించింది. తప్పెవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని శ్రీరెడ్డి హెచ్చరించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తొమ్మిదేళ్ల బాలికపై దారుణం.. శరీరంపై 86 గాయాలు.. అత్యాచారం, హత్య

దేశవ్యాప్తంగా కలకలం రేపిన కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలను మరవకముందే.. మరో దారుణమైన ...

news

రజనీ బీజేపీకి కొమ్ముకాస్తున్నారు.. తమిళ లారీ డ్రైవర్‌పై దాడి జరిగినప్పుడు?

దశాబ్ధాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కావేరి జలాల పంపిణీ ...

news

కాస్టింగ్ కౌచ్‌పై పవన్ స్పందన.. ఇట్స్ ఓకే.. బట్ అసంతృప్తే: శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై అర్ధనగ్న ప్రదర్శనతో పోరు బాట పట్టిన శ్రీరెడ్డి.. పవర్ ...

news

స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావ‌ర్క‌ర్‌కి శిక్ష విధించిన జైలులో కిర‌ణ్ బేడీ

మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ ఇటీవ‌ల అండ‌మాన్ ...

Widgets Magazine