గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (14:11 IST)

అసలేం జరుగుతోంది.. పవన్ ఇలా.. బాబు అలా.. మోడీ సైలెంట్ వెనక..?

ఎన్నాళ్లూ దేహీ.. దేహీ.. దేహీ.. అంటాం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టవద్దు అంటూ టీడీపీ, బీజేపీ ఎంపీలను పవన్ కల్యాణ్ వేడుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం, బీజేపీకి చెందిన ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ తెచ్చేందుకు తప్పకుండా కృషి చేయాలన్నారు. 
 
గతంలో యూపీఏ ప్రభుత్వం సీమాంధ్ర ఎంపీల బయటకు నెట్టేసి దారుణంగా రాష్ట్ర విభజన చేసేసిందని పవన్ గుర్తు చేశారు. ఇదే తరహాలో ప్రస్తుతం ఏపీకి స్పెషల్ స్టేటస్ మాత్రం ఎంపీలు ఊరకుండకూడదని ఎన్డీయే ప్రభుత్వంచే స్పెషల్ స్టేటస్ సాధించి తీరాలంతేనని పవన్ చెప్పారు. ప్రతీసారి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టవద్దని పవన్ మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేశారు. 
 
అయితే బాబు-పవన్‌కు మధ్య చిచ్చు పెట్టింది ఎన్డీయేనని అందుకే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో రాష్ట్ర విభజన పేరుతో తెలుగువారి మధ్య చిచ్చు పెట్టిన యూపీఏ తరహాలోనే.. స్పెషల్ స్టేటస్‌పై మోడీ సర్కారు స్పందించకుండా.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల మధ్య చిచ్చు పెట్టిందనే టాక్ వస్తోంది.
 
తెలుగువారి మధ్య ఇలాంటి చిచ్చులు ముట్టించి లబ్ధి పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, అందుకే తెలుగు రాష్ట్రాల మధ్య జగడాన్ని ముట్టించిన రెండుగా చీల్చిన యూపీఏ తరహాలోనే మోడీ కూడా స్పెషల్ స్టేటస్ విషయంలో నోరుమెదపక ఉన్నారని టాక్ వస్తోంది.