శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 25 ఆగస్టు 2016 (21:58 IST)

చంపుకునేంత అభిమానమా...? హీరోలమంతా ఫ్రెండ్సుగానే ఉంటాం...: పవన్‌ కల్యాణ్‌(video)

గత ఆదివారం ఓ గొడవలో గాయపడి చనిపోయిన తన అభిమాని వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌ గురువారం ఉదయం తిరుపతికి వెళ్ళారు. వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. పవన్‌ స్థాపించిన జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన వినోద్‌, ఏ

గత ఆదివారం ఓ గొడవలో గాయపడి చనిపోయిన తన అభిమాని వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌ గురువారం ఉదయం తిరుపతికి వెళ్ళారు. వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. పవన్‌ స్థాపించిన జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన వినోద్‌, ఏ హీరో గొప్ప అన్న అంశంపై ఓ గొడవ రావడంతో, ఆ గొడవలో పలువురు దాడి చేయగా చనిపోయాడు.
 
ఇక వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ''హీరోలందరూ సమానమే. మేమందరం బాగానే కలిసి ఉన్నాం. మా హీరో గొప్ప అంటూ గొడవపడటం అభిమానులకు మంచిది కాదు. నేనైతే దీన్ని క్షణికావేశం వల్ల జరిగిన హత్యగా చూస్తున్నా. ఏదేమైనా అభిమానం పేరుతో చంపుకునే దాకా వెళ్ళడం మంచిది కాదు. అభిమానాన్ని మితిమీరిన స్థాయికి తీసుకెళ్ళి హింసకు దారితీసేలా చేయొద్దని కోరుకుంటున్నా'' అని సందేశమిచ్చారు.
 
తెలుగు చిత్ర పరిశ్రమలోని సాటి హీరోలతో తనకెన్నడూ గొడవలు లేవని, అసలు పరిశ్రమలో ఏ హీరో కూడా మరో హీరోతో గొడవలు పెట్టుకోరని, కింది స్థాయిలో అభిమానుల మధ్యే విభేదాలుంటాయని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించాడు. హీరోల మధ్య పోటీతత్వం మాత్రమే ఉంటుందని, అది సినిమాలకు మాత్రమే పరిమితమని, మిగతా విషయాల్లో కలిసే ఉంటామని స్పష్టం చేశాడు. మితిమీరిన అభిమానం హింసకు, హత్యలకు దారితీస్తే, అది సహించరాని నేరమవుతుందని తెలిపాడు. సినిమా హీరోలపై పెచ్చు మీరిన అభిమానం ఓ కుటుంబాన్ని వీధిన పడేసిందని, ఇది చాలా దారుణమైన ఘటనగా పవన్‌ అభివర్ణించారు. 
 
అభిమానం హద్దులు దాటి పైశాచికంగా మారడాన్ని ఎవరూ హర్షించరని, వినోద్‌ మరణానికి కారణమైన వారిని చట్టం ముందు దోషిగా నిలపాల్సిందేనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హద్దులు దాటి ఒకరిని ఒకరు హత్యలు చేసుకునేంత అభిమానాన్ని ఎవరూ హర్షించరని హితవు పలికారు. ఏ హీరో అభిమానులైనా హద్దుల్లో ఉంటేనే మంచిదని వివరించారు. ఈ ఘటనతో వినోద్‌ తల్లికి తీరని శోకం మిగిలిందని, భవిష్యత్తులో ఎవరి అభిమానులైనా ఈ తరహా చర్యలకు దిగకుండా ఉండాలని పవన్‌ సూచించారు.