శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (08:51 IST)

నా మరణం పోలీసులకు ఓ అస్త్రం కావాలి... పీజీ విద్యార్థిని సంధ్యారాణి డైరీలో కన్నీటి రాత

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళా ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్థిని సంధ్యారాణి కన్నీటితో రాసుకున్న డైరీ ఒకటి బయటపడింది. ఇందులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు పూసగుచ్చి

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళా ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్థిని సంధ్యారాణి కన్నీటితో రాసుకున్న డైరీ ఒకటి బయటపడింది. ఇందులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు పూసగుచ్చినట్టు వివరించింది. ప్రొఫెసర్‌ వేధింపులు తట్టుకోలేనంత మానసిక హింస! భరించలేని బాధ! రెండేళ్లుగా గూడుకట్టుకున్న ఆవేదన అక్షరమై కనిపించింది. ఏడు పేజీల్లో కన్నీరై ప్రవహించింది.
 
గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్‌ లక్ష్మి వేధింపులకు బలైపోయిన పీజీ విద్యార్థిని డాక్టర్‌ సంధ్యారాణి ఆవేదన. ఆత్మహత్యకు ముందు తన డైరీలో వ్యక్తం చేసిన ఆక్రోశం... నా ఆత్మహత్యకు ప్రధాన కారణం ప్రొఫెసర్ లక్ష్మి. అమెను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలొద్దు. ఆమెను ఎక్కడా బోధనలో ఉండకుండా చేయండి. నాలాగా మరే విద్యార్థినీ బలి కాకూడదు. ఆమెలాంటి సైకో చేతిలో నాలాంటి వారు ఎందరో బాధపడుతున్నారు. 
 
ఆమెకు విద్యార్థులంటే పురుగులతో సమానం. ఆమె వాడిన భాష మనిషి నోటి నుంచి వచ్చేది కాదు. జీజీహెచ్ గైనకాలజీ విభాగం పూర్తి స్థాయిలో చెడిపోయింది. నా మరణంతోనైనా ఆమెకు పడే శిక్షతో ఆ విభాగం బాగుపడాలని, విద్యార్థులు సంతోషంగా చదువులు పూర్తి చేయాలని కోరుకుంటున్నా. నా మరణం పోలీసులకు ఆయుధం కావాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించింది.
 
మరోవైపు... ప్రొఫెసర్ లక్ష్మి అజ్ఞాతంలోకి జారుకున్నారు. సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె కనిపించకుండా పోయారు. ఆమె సర్వీసులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమె సుమారుగా 30 ఏళ్లుగా జీజీహెచ్‌లో పని చేస్తున్నారు. ఇన్నేళ్లలో ఆమె వద్ద పనిచేసిన వారు, విద్యార్థులు, సహచరులు, చికిత్స పొందిన రోగుల్లో ఒక్కరంటూ ఒక్కరు కూడా ఆమె మంచిదని విచారణ కమిటీ ముందు చెప్పలేదు. ఆమె తన పై అధికారులను కూడా బెదిరించి డ్యూటీలకు డుమ్మా కొట్టేవారని చెబుతున్నారు.