మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (07:14 IST)

ఈ టీచరమ్మకు ఇదేం పాడుబుద్ధో.. వలసదారులను ఏకంగా చంపేయమంటోందే..!

జాతి వివక్షా ఉన్మాదంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊగిపోతోంటే.. ఆ ప్రబుద్ధుడికి ఏమాత్రం తీసిపోనని ఈ ఆమెరికన్ టీచరమ్మ నిరూపించుకుంటోంది. వలసదారులను దేశంనుంచి పంపేయడం ఎందుకు తుపాకితో కాల్చి పడేయకుండా అంటూ ట్వీట్ల మీద ట్లీట్లు చేస్తూ పోయింది. ట్ర

జాతి వివక్షా ఉన్మాదంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊగిపోతోంటే.. ఆ ప్రబుద్ధుడికి ఏమాత్రం తీసిపోనని ఈ ఆమెరికన్ టీచరమ్మ నిరూపించుకుంటోంది. వలసదారులను దేశంనుంచి పంపేయడం ఎందుకు తుపాకితో కాల్చి పడేయకుండా అంటూ ట్వీట్ల మీద ట్లీట్లు చేస్తూ పోయింది. ట్రంప్ సాక్షిగా ఆమె నుంచి వస్తున్న ఈ కంపును మేం భరించలేం అంటూ ఆ స్కూలు యాజమాన్యం ఆమెను సాగనంపింది. 
 
వలసదారుల గురించి అమెరికాలో ఓ మహిళా టీచర్‌ తీవ్రమైన పరుష పదజాలం వాడింది. మైగ్రెంట్స్‌ను తిరిగి వెనక్కి పంపించడానికి బదులు వారిని చంపేయండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకి పెట్టి వలసదారులను చంపండి అంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసింది. ఇలా ఒక్కటి కాదు పలు తీవ్రమైన మాటలతో వలసదారులను కించపరిచేలాగ మాట్లాడగా ఆమెపై పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకొంది. స్కాట్స్‌ డేలోని పరదేశ్‌ జ్యూయిష్‌ డే పాఠశాలలో చదువుతున్న బోన్నీ వర్నె అనే మహిళా ఉపాధ్యాయురాలు గత పన్నేండుళ్లుగా థర్డ్‌ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తోంది.
 
ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక వలసదారులు భయపడిపోతుండగా వారి భయాన్ని మరింత రెట్టింపు చేసే తీరుగా బోన్నీ వ్యాఖ్యలు చేసింది. సోషల్‌ మీడియాలో అవతలి వారు అడిగిన దానికి డిమాండ్‌గా అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపించండి లేదంటే వారి తలలోకి బుల్లెట్లు ఉన్నపలంగా దించేయండి’ అంటూ కామెంట్‌ చేసింది. తాను ఈ స్వేఛ్చా దేశం(అమెరికా)లో కంపుకొట్టేలా పేరుకుపోయిన చెత్తకుప్పల్లో(వలసదారులు, శరణార్థులు) మునిగిపోతున్నానంటూ కూడా వివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసింది.
 
ఈ మాటలు ఇంటర్నెట్‌లో వారం రోజులపాటు హల్‌చల్‌ చేశాయి. దీంతో పాఠశాల యాజమాన్యం ఆమెను పిలిచి సమావేశం అయిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమెకు ఉన్న హక్కులను తాము గౌరవిస్తామని, అయితే, అలాగని సమాజం గర్హించని, తగని వ్యాఖ్యలు స్కూల్‌ పరిధిలో ఉంటూ చేస్తే అంగీకరించబోమని స్కూల్‌ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత పొరపాట్లకు తమ పాఠశాల ఏమాత్రం అనుమతించదని స్పష్టం చేసింది.