శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (08:30 IST)

పురుషుడికి సైకో సూదిపోటు... ఎక్కడ?

సిరంజి సైకో తన పంథా మార్చుకున్నాడు. తనను చూసి అమ్మాయి నుంచి అమ్మమ్మ వరకూ భయపడి పారిపోతుంటే, పురుషులకు సూదిపోట్లు పొడవడం మొదలెట్టేశాడు. ఆదివారం మధ్యాహ్నం ఓ పురుషుడిపై సూదితో దాడి చేశాడు. వివరాలిలా ఉన్నాయి. 
 
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రజలు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఆదివారం ఉదయం ఓ చిన్నారికి ఇంజక్షన్ చేసిన ఆ ఉన్మాది కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి పంజా విసిరాడు. పెంటపాడు మండలం జట్లపాలెంలో ఓ వ్యక్తికి సూది గుచ్చి పరారయ్యాడు.
 
ఆ వ్యక్తిని 108 అంబులెన్సులో తాడేపల్లి గూడెం ఆసుపత్రికి తరలించారు. కాగా, సూదిగాడి ఉన్మాదానికి గురైన బాధితుల సంఖ్య 16కి చేరినట్టు సమాచారం. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా అతగాడు దొరక్కపోవడంతో ప్రజల్లో భయం రాజ్యమేలుతోంది.