శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (11:06 IST)

నేడు చంద్రబాబు జన్మదినం... నరేంద్ర మోడీ శుభాకాంక్షల ట్వీట్స్..!

ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 20వ తేది సోమవారం రోజు 65వ పడిలోకి అడుగుపెట్టిన చంద్రబాబుకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా మోడీ శుభాకాంక్షలు చెప్పారు.
 
జన్మదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు సోమవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన జీవితం తెలుగు జాతికి అంకితమని వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యాలయంలో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.