శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (11:48 IST)

ప్రధాని ఎస్కార్ట్ వాహనం డ్రైవర్‌ చిత్తూరులో ఆత్మహత్య

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎస్కార్ట్‌లో వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ శేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. శేఖర్‌ స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కొర్లమిట్ట గ్రామం.

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎస్కార్ట్‌లో వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ శేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. శేఖర్‌ స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కొర్లమిట్ట గ్రామం. విధుల్లో ఉన్న శేఖర్‌ తనకు కేటాయించిన క్వార్టర్స్‌లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే శేఖర్‌ ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేక విమానంలో శేఖర్‌ మృతదేహాన్ని ఢిల్లీ నుంచి పూతలపట్టుకు తీసుకువచ్చారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలను పూర్తి చేశారు. 
 
1999 సంవత్సరంలో శేఖర్‌ బీఎస్‌ఎఫ్‌లో చేరాడు. శిక్షణ అనంతరం కొన్నిరోజుల పాటు డిప్యుటేషన్‌పై సీబీఐలో పనిచేశాడు. ఆ తరువాత స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌‌కి బదిలీ అయ్యాడు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వద్ద అంగరక్షకుడిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాడు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్కార్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.