గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:20 IST)

పాలా...! రసాయినా పాళ్లా...!! తాగారో అంతే గతి.

చూసేందుకు అవి పాలను మించిన విధంగా కనిపిస్తాయి. లీటరు స్థానంలో రెండు లీటర్లు తీసుకుందామనిపిస్తుంది. కానీ అవి పాలు ఎంత మాత్రం కావు. అంతా రసాయిన పాళ్లే ఎక్కువ. అనంత వాసులు చాలా కాలంగా వాటినే సేవించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ కృత్రిమ పాలను తయారు చేసి ఏకంగా డెయిరీలకే అమ్మకాలు జరిపే ఓ ముఠా గుట్టు రట్టు చేశారు అనంతపురం పోలీసులు. అనంతలో తీగ లాగితే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇదే తరహా తంతు సాగుతున్నట్లు తేలింది. వివరాలిలా ఉన్నాయి. 
 
అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని ఎం.చెర్లోపల్లిలో కొందరు ఓ ముఠాగా తయారై పాలను కృత్రిమంగా తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతోంది. కేవలం రసాయినాలను వినియోగించి తయారు చేసిన కృత్రిమ పాలను ధర్మవరం సమీపంలోని ఓ డెయిరీకి తరలించేవారు. అయితే విషయం అందుకున్న పోలీసులు ముఠాపై దాడి చేశారు. 
 
అనంతపురంలోని కుమార్ ఏజెన్సీపై దాడి చేసి కృత్రిమ పాల తయారీలో వాడే 7 టన్నుల మాల్టోడెక్స్‌ట్రైన్ పౌడర్‌ను సీజ్ చేశారు. దీంతోపాటు ఇక్కడి పోలీసులు అందించిన సమాచారం మేరకు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని బ్లూ ఓషన్ బయోటెక్ కంపెనీపై అక్కడి డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు దాడి చేసి అరకోటి విలువ చేసే పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
 
ఈ దాడుల్లో బోడిమల్ల కృష్ణారెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. నట్లు విచారణలో వారు అంగీకరించారు. ఈ పౌడర్‌ను చాక్ లెట్లు, ఐస్‌క్రీంల తయారీలో వాడతారని వారు వెల్లడించారు. కృత్రిమ పాలు తయారుచేస్తున్న వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.